ఉరవకొండ: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గ్రామాల్లో వైయస్సార్సీపి కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాలు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని మండలాల్లోని గ్రామాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం బెళుగుప్ప మండలం రామసాగరం గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటుపరం కాకుండా కోటి సంతకాల సేకరణతో కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిపిద్దామని నాయకులు పేర్కొన్నారు.