నందికోట్కూరు: పల్లె ప్రియాంక సేవా సమితి వారి ఆధ్వర్యంలో: వినికిడి పరికరాలు అందించడం గర్వకారణం జిల్లా జడ్జి లీలా వెంకట శేషాద్రి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో వినికిడి లోపం ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి వినికిడి పరికరాలు అందించడం ఎంతో గర్వకారణం అని జడ్జిలు పేర్కొన్నారు సోమవారం నందికొట్కూరు పట్టణంలో పల్లె ప్రియాంక సేవా సమితి వారు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు, ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వినికిడి లోపం ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి వినికిడి పరికరాలు అందించారు, ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జిల్లా జడ్జి మోహన్ రావు, జడ్జిలు లీలా వెంకట శేషాద్రి, శోభారాణి, దివ్య హాజరయ్యారు