ఆత్మకూరు: సోమశిలలో తాటిచెట్టు పైన పడి గేదె అక్కడికక్కడే మృతి
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, సోమశిలలో ఓ గేద మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. తుఫాన్ నేపథ్యంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో సోమశిలలోని ఎస్సీ కాలనీలో భారీ తాటి చెట్టు నెల పై పడింది. అదే సమయంలో అక్కడ ఓ గేద ఉండడంతో గేదెపై తాటిచెట్టు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గేదె మృతితో యజమాని కన్నీటి పర్యంతం అయ్యారు.