సైదాపూర్: కరీంనగర్లో అక్రమ పేలుడు పదార్థాల పట్టివేత: ఒకరు అరెస్ట్
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం శివారులో 475 జిలెటిన్ స్టిక్స్, 3000 మీటర్ల డిటోనేటింగ్ వైర్లతో పాటు రెండు కంప్రెసర్ ట్రాక్టర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో రామడుగు మండలానికి చెందిన భూమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.