డోన్: పట్టణ పరిశుభ్రతకు సహకరించాలి : బేతంచర్ల కమిషనర్ హరిప్రసాద్
Dhone, Nandyal | Apr 22, 2026 బేతంచెర్ల నగర పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసేందుకు మూడు రకాల బుట్టలను పంపిణీ చేశారు. సీఐ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ నాగమణి చేతుల మీదుగా వీటిని అందజేశారు. ప్రతి ఒక్కరూ పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని కమిషనర్ హరిప్రసాద్ సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ పరిధిలోని ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై నిరంతరం అవగాహన కల్పించాలని ఆయన కోరారు.