నందికోట్కూరు: పట్టణంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జయ సూర్య మున్సిపల్ కమిషనర్
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కేజీ రోడ్డులో శరవేగంగా జరుగుతున్న వైండింగ్ (రోడ్డు అభివృద్ధి) పనులను నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య మున్సిపల్ కమిషనర్ శ్రీ జి. వెంకటరామిరెడ్డి, మున్సిపల్ డీఈ,ఏఈ సంబంధిత అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు, పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ అధికారులకు సూచనలు చేశారు,ఈ కార్యక్రమంలో అధికారులు పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ముర్తుజావలి, టిడిపి నాయకులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.