భీమడోలు లో మహిళా సమైక్య ఆధ్వర్యంలో మన డబ్బులు మన లెక్కలు అవగాహన ర్యాలీ
Unguturu, Eluru | Sep 24, 2025 భీమడోలు గ్రామంలో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు మన డబ్బులు మన లెక్కలు యాప్ పై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. సెర్ప్ ప్రతినిధులు ఝాన్సీ, జయశ్రీ మాట్లాడుతూ మన డబ్బులు మన లెక్కలు యాప్ ద్వారా ప్రతి లావాదేవీ పారదర్శకంగా సంఘంలోని ప్రతి సభ్యురాలికి తేటతెల్లం అవుతుందన్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా స్పష్టత లభిస్తుందని చెప్పారు. ఈ యాప్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి ముందడుగు వేసి అభివృద్ధి పదం వైపు పయనించాలన్నారు.