అదిలాబాద్ అర్బన్: మావల మండలం భట్టి సావర్గామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులకు గాయాలు
ఆదిలాబాద్ జిల్లాలో మావల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులకు గాయాలయ్యాయి. బట్టి సావర్గామ బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రి కొడుకులను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో భీంపూర్ కు చెందిన తండ్రి సంతోష్, కొడుకు సాయి కి గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది గాయపడ్డ వారిని రిమ్స్ కు తరలించారు