సూర్యాపేట: సూర్యాపేటలో ఘోర ప్రమాదం: మార్నింగ్ వాక్కు వెళ్లిన ఇద్దరి మృతి
సూర్యాపేట జిల్లా బాలెంల స్టేజీ వద్ద మార్నింగ్ వాక్కు వెళ్లిన ముగ్గురిని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ నరసింహ, ప్రజలు మార్నింగ్ వాక్‌ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.