నంద్యాల అర్బన్: నంద్యాలలో ఓ హోటల్లో సందడి చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | May 9, 2026
నంద్యాల పట్టణంలోని ఓల్డ్ టౌన్ లో గల తాజ్ హోటల్లో శనివారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సందడి చేశారు. ఓ సామాన్య పౌరురాలుగా ప్రజల మధ్య వచ్చి భోజనం చేశారు దీంతో హోటల్ యాజమాన్యంతో పాటు అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురి అయ్యారు. అనంతరం ఎంపీ శబరి మాట్లాడుతూ తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే మీ హోటల్ కి వచ్చి భోజనం చేస్తానని చెప్పడం జరిగిందని అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగిందని ఇది పబ్లిసిటీ కోసం చేసింది కాదని ఆమె తెలిపారు