ఒంగోలు అర్బన్: ఒంగోలులోని పాత మార్కెట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి, గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 24, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని పాత మార్కెట్ వద్ద బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియలేదని మృతుడు అతిగా మద్యం సేవించి మృతి చెంది ఉండవచ్చు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.