పుంగనూరు: గువ్వల గుట్టకు స్తంభించిన రాకపోకలు ప్రమాదకరంగా వంతెన దాటుతున్న ప్రజలు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజవర్గం సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ గువ్వల గుట్టకు వెళ్లే మార్గంలో చెన్నపట్నం చెరువు కట్ట కింద తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టు వరద ప్రవాహానికి దెబ్బతిన్నది. ఆదివారం ఉదయం పదిగంటల ప్రాంతంలో చెన్నపట్నం చెరువు మరువ వద్ద ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్న ప్రజలు. సోమల మండల వ్యాప్తంగా శనివారం రాత్రి భారీ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాలలో రాకపోకులకు అంతరాయం ఏర్పడింది.