నరసరావుపేట పట్టణంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం
ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉండటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి అమలాకుమారి ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో తన కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. గ్రామాల్లో ఏ విధమైన ప్రకృతి వ్యవసాయం చేయించాలి ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం అవగాహనపై ప్రతిజ్ఞ చేయించారు.