నంద్యాల అర్బన్: మహానందిశ్వరుడికి హుండీ ఆదాయం రూ 60.18 లక్షలు
Nandyal Urban, Nandyal | May 29, 2026
ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది పుణ్యక్షేత్రంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించారు.60 రోజులకు గాను హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా దేవస్ధానానికి రూ.60,18,167 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో ఎన్. శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధాన ఆలయాల్లోని హుండీల ద్వారా రూ.59,21,476 లక్షలు, అన్న ప్రసాదం ద్వారా రూ.69,515 వేలు, గో సంరక్షణ ద్వారా రూ.27,176 వేలు వచ్చిందన్నారు. అలాగే హుండిలో బంగారం-2 గ్రాముల 950 మిల్లి గ్రాములు, వెండి-260 గ్రాములు లబించాయన్నారు. ఈ హుండీ లెక్కింపులో కార్యక్రమంలో వెలుగోడు గ్రూప్ టెంపుల్ ఈఓ జనార్దనశెట్టి,దేవస్థానం ఏఈవో మధు, పర్యవేక్షకులు శశిధర్ రెడ్డి,