ఈడిగిపల్లి చెక్పోస్ట్ వద్ద ఆటో బోల్తా ముగ్గురికి తీవ్ర గాయాలు.
ఈడిగిపల్లి వద్ద ఆటో బోల్తా పడి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డ ఘటన ఆదివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు కథనం మేరకు మదనపల్లి మండలం కృష్ణాపురం జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద నివాసం ఉండే ఎన్. శ్రీనివాసులు తన తన సొంత ఆటోలో ఈడిగి పల్లె నుంచి మదనపల్లికి ప్యాసింజర్లను తీసుకొని వస్తుండగా ఆటో బోల్తా పడటంతో డ్రైవర్ శ్రీనివాసులతోపాటు ప్యాసింజర్లు డి.శ్రీనివాసులు, సునీతలు గాయపడడంతో 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.