అనంతపురం అర్బన్: తన భార్యను దూషించారని వ్యక్తిపై కట్టెతో విచక్షణారహితంగా దాడి
Anantapur Urban, Anantapur | Apr 9, 2026
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని కల్లూరు గ్రామంలో తన భార్యను దూషించారని శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిపై కల్లూరు గ్రామానికి చెందిన శర్మాస్ వలి అనే వ్యక్తి కట్టతో విచక్షణారహితంగా దాడి చేశాడు. గాయపడిన తనని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.