ఒంగోలు అర్బన్: ఒంగోలులో మీడియాతో మాట్లాడిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి, సర్ కార్యక్రమంలో ఓట్లు తొలగించవద్దని డిమాండ్
Ongole Urban, Prakasam | Jul 7, 2026
SIR పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని CPM కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి అన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మంగళవారం ఒంగోలు పట్టణంలో మీడియాతో మాట్లాడిన రమాదేవి...రాజకీయ ప్రయోజనాల కోసం ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు చేయరాదని, పారదర్శకంగా ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ నిర్వహించాలని ఆమెకోరారు.