జిల్లా రైతాంగానికి సాగునీటి సరఫరా, కాలువల నిర్వహణపై నరసరావుపేట కలెక్టరేట్లో సాగునీటి సలహా మండలి సమావేశం మంగళవారం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి హాజరై, సాగునీటి లభ్యత, విడుదలపై అధికారులతో సమీక్షించారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు చదలవాడ, జూలకంటి, భాష్యం, MLC రాజశేఖర్, జీవీ తమతమ నియోజకవర్గాల్లోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.