ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్ ఆదివారం సెలవు రోజు కావడంతో సందర్శకుల రద్దీ కనిపించింది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఉదయం నుంచే ప్రజలు బీచు తరలి వస్తున్నారు. ఆదివారం ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతున్నామన్నారు. బీచ్లో స్నానాలు చేసిన తర్వాత సరైన బాత్రూంలు లేవని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. మంచి బాత్రూం వసతులు కల్పించాలని కోరుతున్నారు.