గుంటూరు: వీరాంజనేయులు అనే వ్యక్తి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేపట్టిన కుటుంబ సభ్యులు
Guntur, Guntur | Sep 15, 2025 గత పది రోజుల క్రితం కనిపించకుండా వెళ్లిపోయిన వీరాంజనేయులు మురుగు కాలవలో మృతదేహమై అనిపించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంతవరకు వీరాంజనేయులు ఏ విధంగా మృతి చెందాడు విచారణ చేపట్టలేదన్నారు. సోమవారం సాయంత్రం గుంటూరు కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేపట్టారు. పోలీసులు స్పందించి వీరాంజనేయులు మృతికి గల కారణాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. వీరాంజనేయులు మృతి వెనక హత్య కుట్ర కోణం ఉందన్నారు. వీరాంజనేయులు ను కిడ్నాప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.