ఆళ్లగడ్డ: చాగలమర్రిలో కల్వర్టు ను ఢీకొన్న కంటైనర్, డ్రైవర్ కు గాయాలు
నంద్యాల జిల్లా చాగలమరి మండల కేంద్రంలో గురువారం కంటైనర్ వాహనం కల్వర్టు ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది, చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ వాహనం వేగంగా రావడంతో టోల్ గేట్ వద్ద నియంత్రణ తప్పి కల్వర్టును ఢీ కొట్టింది, ఈ ప్రమాదంలో కంటైనర్ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ కు గాయాలయ్యాయి, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.