అసిఫాబాద్: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి:జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ నుంచి ఎంపీడీవో లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ఈ నెల 23నప్రారంభించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం క్రింద పీవీపీజీలకు మంజూరైన ఇళ్లను పనులు ప్రారంభించాలని తెలిపారు. గ్రామపంచాయతీలో ఆస్తిపన్నులు 100 శాతం వసూలు చేసి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. వరదలకు దెబ్బతిని రహదారులకు మరమ్మతులు చేయాలని సూచించారు.