కర్నూలు: కర్నూలులో ఉల్లి గిట్టుబాటు ధర లేక రోడ్డన పడేసిన ఉల్లి రైతులు ఉల్లి కోసం స్థానికులు పోటి పడ్డారు
కర్నూలు జిల్లాలో ఉల్లి రైతు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో కొందరు ఉల్లి రైతులు కర్నూలు నగర శివారులోని సమ్మర్ స్టోరేజ్ వద్ద వదిలేసిన ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 10 గంటలకు నగర శివారులోని సమ్మర్ స్టోరేజ్ వద్ద రైతులు లారీ లోడు ఉల్లిని వదిలేశార. ఈవిషయం తెలుసుకున్న స్థానికులు ఉల్లి కోసం పోటీపడ్డారు. ఉల్లి సంచులను ఇంటికి తీసుకెళ్లారు. గిట్టుబాటు ధర లేక గత నెల రోజుల నుంచి ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో నిరీ క్షించ లేక ఇలా రోడ్డుపై పడేసి వెళ్లాల్సిన దుస్థితి కర్నూలు లో ఏర్పడింది.