నంద్యాల అర్బన్: సోమవారం మహానంది దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారం, చైర్మన్గా నరాల మౌలీశ్వర్ రెడ్డి
Nandyal Urban, Nandyal | Aug 2, 2026
నంద్యాల జిల్లా మహానంది దేవస్థానానికి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం సోమవారం మహానంది క్షేత్రంలో జరుగుతున్నట్లు ఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 13 మంది సభ్యులతో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఛైర్మన్ గా మసీదుపురం గ్రామానికి చెందిన నరాల చంద్రమౌళీశ్వర రెడ్డి ఎంపికయ్యారు.