అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని పాతూరులో రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 4, 2026
అనంతపురం నగరంలోని పాతూరులో రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తాడపత్రి మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన మహమ్మద్ భాష అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు.