గుంతకల్లు: గుత్తిలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించిన వైసీపీ నాయకులు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోస్టర్లను ఆవిష్కరించి క్యూఅర్ కోడ్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, నాయకులు హుస్సేన్ పీరా, సుభాష్ రెడ్డి, మైనుద్దీన్, మహిళ నాయకురాలు చంద్రగిరి రాధ యాదవ్, డోన్ నియోజవర్గ ఎన్నికల పరిశీలకుడు కోనా మురళీధర్ రెడ్డి లు మాట్లాడుతూ వైకాపా కార్యకర్తల కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ప్రారంభించారని అన్నారు.