రాప్తాడు: పంపునూరులో కార్తీకమాసం సందర్భంగా సుబ్రమణ్య స్వామి వారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో ఆదివారం నాలుగు గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కార్తీక్ మాసం సందర్భంగా సుబ్రమణ్య స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కార్తీకమాసం సందర్భంగా పంపునూరు సుబ్రమణ్య స్వామి వారిని పార్వతి దేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించడం జరిగిందని భవిష్యత్తులో ఈ ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ అందజేస్తానని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు టిడిపి నేతలు పాల్గొన్నారు.