వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి లో మహిళా దారుణ హత్యకు గురైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బండ్లమూడి నాగజ్యోతి వ్యవసాయ కూలీ పనులు చేస్తుంది. ఒంగోలులో పోలీస్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీనావళి అనే వ్యక్తి కట్ట కింద పల్లి లో కొంత భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. సీనా వలికి నాగజ్యోతి వంట చేసి పెట్టేది. సోమవారం వంట చేయటానికి నాగజ్యోతిని ఇంట్లోకి పిలిచిన సీనా వలి ఆమెతో గొడవపడి కొట్టి చంపాడు. అనంతరం తాను కూడా పురుగుల మందు తాగి అపస్మానిక స్థితికి వెళ్లగా పోలీసులు అతనిని కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.