ఒంగోలు అర్బన్: గాడిద మాంసం అని గుర్రం మాంసం విక్రయిస్తున్న ఏడుగురు అరెస్టు ఒక కారు నాలుగు ఆటోలు స్వాధీనం
Ongole Urban, Prakasam | Apr 5, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులోని మంగమూరు సమీప పొలాలలో గాడిద మాంసం అని చెప్పి గుర్రాలను వధించి మాంసం ఎక్కువ ఇస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను ఒంగోలు తాలూకా పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు వారి వద్ద నుండి మాంసంతో పాటు రెండు గుర్రాలను మరియు ఒక కారు నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున గస్తీ తిరుగుతున్న సమయంలో వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి వారిని అరెస్టు చేసినట్లు ఎస్సై చౌడయ్య తెలియజేశారు అరుదైనటువంటి జంతువులను వధించటం వాటి మాంసం విక్రయించడం నేరమని వారిపై యానిమల్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.