మంచిర్యాల: మంత్రి ఇంటి ముట్టడికి వెళ్లిన అంగన్వాడి టీచర్లు హెల్పర్లను అరెస్టు చేసిన పోలీసులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. హైటెక్ సిటీ లోని మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటి ముందు ధర్నా చేసేందుకు వచ్చిన అంగన్వాడీ టీచర్లు హెల్పర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు