కోడుమూరు: గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో వర్షం నీరు లీకేజీ
గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో వర్షం నీరు లీకేజీ అయింది. చాలా ఏళ్ల కిందట నిర్మించిన భవనం కావడంతో గోడల వెంట వర్షం నీరు కారింది. దీంతో టేబుళ్ళు తడిసిపోయాయి. ఎలక్ట్రానిక్ పరికరాలను ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఉంచారు. కార్యాలయం ముందు ప్రదేశంలో కూడా వర్షం నీరు నిలిచింది. కాగా శుక్రవారం ఉదయం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.