వ్యక్తిగత కక్షల నేపధ్యంలోనే గుడ్లూరు లోని లక్ష్మీ నాయుడు హత్య : SP అజిత
అక్టోబర్ 2 న గుడ్లూరు మండలంలో జరిగిన హత్య కేసును చేదించామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఇందులో కులాల ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని శుక్రవారం సాయంత్రం ఆమె హెచ్చరించారు.