నంద్యాల అర్బన్: నంద్యాలలో రెండు నాగుపాముల నాట్యం, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Nandyal Urban, Nandyal | Jun 27, 2026
నంద్యాలలోని మూలసాగరం ప్రాంతంలో ఓ ఇంటి సమీపంలో రెండు నాగుపాములు నాట్యం చేస్తూ కనిపించడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఇంటి పక్కనే నాగుపాములు సంచరిస్తున్నట్లు గుర్తించిన కాలనీ వాసులు వెంటనే అప్రమత్తమై స్థానిక స్నేక్ క్యాచర్ రజాక్కు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ రజాక్ తన బృందంతో ఘటనాస్థలికి చేరుకుని, నాగుపాములను బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.