డోన్: బహు వార్షిక పశుగ్రాసరకం పశుసంవర్ధక రంగంలో ఎంతో ఉపయోగకరం :డోన్ పశువైద్యాధికారి డాక్టర్ నాగరాజు
Dhone, Nandyal | Apr 10, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం తాటిమాను కొత్తూరులో రెడ్ నేపియర్ అనే బహువార్షిక పశుగ్రాస రకాన్ని పశు వైద్యాధికారి డాక్టర్ నాగరాజు పరిశీలించారు. దీని ఉత్పాదకత, నీటి అవసరం, పశువులకు కలిగే పోషక విలువల గురించి రైతులతో చర్చించారు. ఈ గడ్డి రకం తక్కువ ఖర్చుతో ఎక్కువ మేతను అందించగలదని, పశుసంవర్ధక రంగంలో ఇది ఎంతో ఉపయోగకరమని రైతులకు వివరించారు. సరైన విధానంలో సాగు చేస్తే పశువులకు పచ్చి మేత అవసరం ఉండదని తెలిపారు