ప్రిన్సిపాల్ వైఖరికి నిరసనగా రేపల్లె డిగ్రీ కళాశాల విద్యార్థి ఆత్మహత్యా యత్నం, ఆందోళనకు దిగిన విద్యార్థులు
రేపల్లెలోని ఏబీఆర్ డిగ్రీ కళాశాలలో ఒక సెకండ్ ఇయర్ విద్యార్థిని వేధింపులకు గురి చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం విద్యార్థులు ఆందోళన చేశారు.సదరు విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయడంతో అతను కళాశాల ఆవరణలోనే ఆత్మహత్యకు ప్రయత్నించడంతో విద్యార్థుల ఆగ్రహం వెలిబుచ్చి ఆందోళనకు దిగారు. తరగతులు బహిష్కరించి ప్రిన్సిపాల్ రూమ్ ఎదుట బైఠాయించారు.దీంతో ప్రిన్సిపాల్ సదరు విద్యార్థికి తిరిగి అడ్మిషన్ ఇస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.