నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘోర ప్రమాదం,రోడ్డు వేస్తుండగా కంకర మిషన్ తగిలి ఓ వ్యక్తి మృతి
Nandyal Urban, Nandyal | Jun 15, 2026
నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్ సమీపంలో సోమవారం విషాదకార ఘటన చోటుచేసుకుంది శ్రీనివాస సెంటర్ నుంచి సంజీవనగర వైపు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కంకర మిషన్ తగిలి నడిగడ్డ ప్రాంతానికి చెందిన ఇమాంశా అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు రోడ్డు పనులు కంకర మిషన్ తో పనులు నిర్వహిస్తుండగా ఆ మార్గంలో నడుచుకుంటూ వెళుతున్న ఇమాంశా ప్రమాదవశాత్తు మిషన్ మిషన్ కు తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు