నంద్యాల అర్బన్: నంద్యాల రైలు ప్రయాణికులకు శుభవార్త గుంతకల్ మార్కాపురం మధ్య రైలును ఆమోదించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు
Nandyal Urban, Nandyal | May 6, 2026
ఇటీవల ప్రతిపాదించిన గుంతకల్-మార్కాపురం మధ్య రైలును దక్షిణ మధ్య రైల్వే ఆమోదించి ట్రైన్ సర్వీస్ను కేటాయించింది. ట్రైన్ నంబర్ 57407/08 త్వరలో గుంతకల్-మార్కాపురం-గుంతకల్ మధ్య డైలీ పాసింజర్గా ప్రయాణించనుంది. ఈ రైలు ప్రతిరోజూ ఉ.4:30 గంటలకు మార్కాపూరంలో బయలుదేరి ఉ.10:30 గంటలకు గుంతకల్ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 5:30కి గుంతకల్లులో బయలుదేరి రాత్రి 11:30కు మార్కాపురం చేరుతుంది.