నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు శ్రీ గోదాదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో బుధవారం రాత్రి దీపాలంకరణ సేవను భక్తులు వేదపండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో భక్తులు దీపాలను వెలిగించారు. కార్తీకమాసం చివరి రోజు కావడంతో భక్తులు ఆలయంలో దీపాలంకరణ సేవను చేసినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.