వెలిగండ్ల పోలీస్ స్టేషన్ ను కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను డిఎస్పి పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను ఎస్సై కృష్ణ పావనిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్సైను డిఎస్పి ఆదేశించారు. మండలంలోని ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలన్నారు. దొంగతనాల నిరోధానికి సీసీ కెమెరాలను గ్రామాలలో ఏర్పాటు చేసుకునేటట్లు గ్రామస్తులకు అవగాహన కల్పించాలని డీఎస్పీ సూచించారు.