ఒంగోలు అర్బన్: ఒంగోలు మండలం చెరుకుపాలెం సమీపంలో నీటి కుంటలో ఈతకు వెళ్లి నలుగురు చిదారులు మృతి, గ్రామంలో తీవ్ర విషాదం
Ongole Urban, Prakasam | Jun 4, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరుకుపాలెం కుంటలో ఈతకు వెళ్లి గల్లంతైన నలుగురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. గురువారం మధ్యాహ్నం సమయంలో ఈతకు వెళ్లిన సుశాంత్, చిన్ను, దినేష్, అభిరామ్ అనే చిన్నారులు చెరువులో గల్లంతయ్యారు. గట్టుపై బట్టలు ఉండడం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.