ఆత్మకూరు: ఉప్పలపాడు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు అక్కడికక్కడే మృతి
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, ఉప్పలపాడు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారును వేగంగా లారీ ఢీకొట్టడంతో కారు పల్టీలు కొడుతూ పొలాల్లోకి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో హాస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకున్న సోమశిల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.