పలమనేరు: ఓ స్థల వివాదంలో వైసిపి మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ మరియు ఎస్ఐ లోకేష్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం,
పలమనేరు: నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందిలో ఒకరికి చెందిన స్థలంలో నిర్మించుకున్న ఓ కట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ తన అనుచరులతో కలసి వెళ్ళి జెసిబిని తీసుకెళ్ళి కూల్చడానికి ప్రయత్నించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే ను వారి అనుచర గణాన్ని అడ్డుకున్నారు. దీంతో ఘటనా స్థలం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.