బనగానపల్లె: యాగంటిలో రూ 5.08 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం పరిధిలో రూ.5.08 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. భక్తుల సౌకర్యార్థం గదులు, డార్మిటరీలు, షాపులు, అన్నదాన సత్రం, లడ్డూ కౌంటర్, క్యూ లైన్, షెడ్ నిర్మాణ పనులు చేపట్టారు. త్వరలో పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు.