మైదుకూరు అర్బన్ సీఐ రమణారెడ్డి ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. గురువారం సాయంత్రం పోరుమామిళ్ల రోడ్డులో వాహన తనిఖీ నిర్వహించిన ఆయన, డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను దగ్గర ఉంచుకోవాలని, రోడ్డు భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు.