కోడుమూరు: కోడుమూరులో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులకు ఈగల్ టీం అవగాహన
మాదకద్రవ్యాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈగల్ టీం పోలీసులు విద్యార్థులకు సందేశం ఇచ్చారు. సోమవారం కోడుమూరులోని ప్రైవేట్ డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈగల్ టీం ఇన్చార్జిగా ఐజి ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల అంతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ వలన కలిగే అనర్థాలు వాటి వలన పర్యావసానాలు వివరించారు. విద్యార్థులచే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.