అన్నమయ్య జిల్లా రాయచోటి చెక్పోస్ట్ వద్ద ఉన్న శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో దీపోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి అభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు “హర హర శంభో” నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం మహిళలు వేలాది దీపాలను వెలిగించగా, దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం ప్రకాశవంతంగా మారి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.