సంఘపట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా అవుకు మండలం సంగపట్నంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. అనంతరం రూ.78 లక్షల విలువైన సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. నిరుపేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు భరోసా కల్పిస్తామన్నారు.