సైబర్ నేరాలు, డ్రగ్స్, సోషల్ మీడియా ప్రభావం, సామాజిక బాధ్యత, మహిళల భద్రతపై శక్తి యాప్, వాట్సప్ సేవలపై పాఠశాలలు–కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కర్నూల్ డీఎస్పీ జె. బాబు ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కర్నూల్ రెండో పట్టణ సీఐలు నాగరాజారావు, మన్సూరుద్దీన్, ఎస్సై తిమ్మయ్య బృందం కర్నూలు టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.డయల్ 112, 100, 1098, 1930, శక్తి యాప్‌తో పాటు మహిళలు అత్యవసర ఫిర్యాదులకు శక్తి వాట్సప్ 7993485111 ను సేవ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. డ్రగ్స్ వినియోగం–విక్రయాల సమాచారం కోసం ఈగల్ టోల్ ఫ్రీ 1972 కు తెలపాలని విజ్ఞప్తి చ