ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి అస్తమాతో సోమవారం మృతి చెందాడు. డోన్ జీఆర్పీ పోలీసులు ఆధార్ కార్డు ద్వారా జార్ఖండ్ వాసిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. డోన్ ద్రోణాచలం సేవాసమితి సభ్యుల ఆధ్వర్యంలో పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో కుటుంబీకుల మధ్య జార్ఖండ్ పద్ధతిలో అంత్య క్రియలు చేశారు.