బనగానపల్లె: బనగానపల్లెలో 28 మంది లబ్ధిదారులకు రూ. 14.20 లక్షల విలువైన CMRFచెక్కులను అందజేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణ క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం వివిధ రోగాలతో బాధపడుతూ ఆరోగ్యశ్రీ కిందికి రాని రోగాలకు వివిధ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న 28 మంచి లబ్ధిదారులకు 14, 20,195 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కుల మత ప్రాంత భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేస్తున్నామని తెలిపారు